డాక్టర్ ప్రీతి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు హైదరాబాద్ లోని నిమ్స్ వైద్యులు. ఎక్మో సపోర్ట్ తో వెంటలేటర్ పై చికిత్స అందిస్తున్నామని ఈ నివేధికలో పేర్కొన్నారు వైద్యులు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.. ప్రీతికి ప్రామాణిక మార్గదర్శకాలు, ప్రోటోకాల్ ప్రకారం వైద్య చికిత్స.. ప్రీతిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామన్నారు నిమ్స్ వైద్యులు.
ఆమెకు అవసరమైన వైద్య చికిత్సను ప్రత్యేక స్పెషలిస్ట్ లో వైద్య బృందం అందిస్తోందని తెలిపారు నిమ్స్ వైద్యులు. కాగా, వైద్య విద్యార్థిని ప్రీతి గారిని శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు గారు పరామర్శించారు. రెండు రోజుల జిల్లా పర్యటన ముగించుకుని, నేరుగా నిమ్స్‌కు వెళ్లి ప్రీతి ఆరోగ్యంపై సమీక్ష నిర్వహించారు మంత్రి హరీశ్ రావు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్, చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్న మంత్రి మంత్రి హరీశ్ రావు… అత్యుత్తమ వైద్యం అందించాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులకు ఆదేశించారు.