ప్రస్తుతం చాలా మంది కి ఓమిక్రాన్ భయం పట్టుకుంది. ఓమిక్రాన్ గత వేరియంట్ ల కంటే తీవ్రమైందని.. ముప్పు ఎక్కువ గా ఉంటుందని పలువురు వైద్యులు చెప్పడం తో చాలా మంది ఓమిక్రాన్ అంటే నే భయపడుతున్నారు. అయితే ఇప్పడు ఈ వార్త కాస్త ఉపశమనం కలిగించేల ఉంది. ఇటీవల రాజస్థాన్ లో ని జైపూర్ లో తొమ్మది మంది కి ఓమిక్రాన్ సోకిన విషయం తెలిసిందే. వారి అందరూ కూడా ఓమిక్రాన్ వేరియంట్ నుంచి కోలుకున్నారు. అంతే కాకుండా ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యారు.
ఆ తొమ్మిది మందిలో ఒకరి కూడా తీవ్ర మైన సమస్యలు రాకపోవడం తో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆ తొమ్మిది మంది ఓమిక్రాన్ నుంచి కోలుకున్నా.. 7 రోజుల పాటు హోం క్వారైంటన్ లో తప్పక ఉండాలని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు తెలిపారు. కాగ ఇటీవల మహా రాష్ట్ర లో కూడా ఒకరు ఓమిక్రాన్ ను జయించి అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఓమిక్రాన్ వేగం గా వ్యాప్తి చెందినా.. ముప్పు తక్కువే నని అని పలువురు వైద్యులు తెలుపుతున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే ముప్పు తక్కువ ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోని వారికి ఓమిక్రాన్ ప్రమాదమేనని అంటున్నారు.