ఏపీ, తెలంగాణకు మరోసారి వర్షాలు… హెచ్చరించిన వాతావరణ కేంద్రం.

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. వరసగా కురుస్తున్న వర్షాలు ఏపీ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరసగా వస్తున్న వాయుగుండాలు, అల్పపీడనాలు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జవాద్ భారీ నుంచి బయటపడ్డామనుకునే లోపే మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చిరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి సముద్రమట్టానికి 0.9 కి.మీ.ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. తూర్పు దిశ నుంచి ఏపీ, తెలంగాణ వైపు వీస్తున్న గాలులతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఈ ద్రోణి శ్రీలంక నుంచి పశ్చిమ బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉండటంతో ఏపీలోని అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని… ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు.. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news