బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. 2023-24లో జీడీపీ వృద్ధిరేటును 6.5 శాతంగా సర్వే అంచనా వేసింది. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు పార్లమెంట్‌లో దివంగత ఎంపీలు, మాజీ సభ్యులకు నివాళులర్పించారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.5 శాతం ఉండొచ్చని ఆర్థిక సర్వే లెక్కగట్టింది. ప్రస్తుత ఏడాదిలో వృద్ధిరేటు అంచనా 7 శాతం. 2021-22లో ఇది 8.7 శాతంగా ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుందని సర్వేలో తేలింది. కరోనా కారణంగా మందగించిన ఆర్థిక స్థితి తిరిగి గాడిలో పడిందని వెల్లడించింది.