నిర్భయ కేసు.. విడాకులు కావాలంటున్న దోషి భార్య

-

ఊరి శిక్ష వాయిదా వేయించడానికి నిర్భయ దోషులు చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పటికే పలుమార్లు వివిధ పిటిషన్‌లు దాఖలు చేసి.. ఊరి శిక్షను వాయిదా వేయించారు. న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని సెక్షన్లను ఆసరాగా చేసుకుని వారు ఈ విధమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునిత కొత్త వాదనను తెరమీదకు తెచ్చింది. దోషులకు మార్చి 20న ఊరి ఖరారు కావడంతో.. అత్యాచారం కేసులో ఊరి శిక్ష పడ్డ వ్యక్తికి తాను భార్యగా ఉండలేనని బీహార్ ఔరంగాబాద్ కోర్టులో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ఈ పిటిషన్ కోర్టులో మార్చి 19న విచారణకు రానుంది.

పునిత మాట్లాడుతూ.. “నా భర్త అమాయకుడు. ఊరి తీసే ముందే నా భర్త నుంచి చట్ట ప్రకారం విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను” అని తెలిపింది. ఆమె తరఫు లాయర్ ముకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. “ముకేశ్ భార్యకు అతని నుంచి విడాకులు తీసుకునే హక్కు ఉంది. అందుకోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(2)(II) ప్రకారం పునితకు విడాకులు తీసుకునే హక్కు ఉంది. భర్త అత్యాచారం వంటి ఘటనల్లో దోషిగా తెలితే భార్యకు విడాకులు తీసుకునే హక్కును ఈ సెక్షన్ కల్పిస్తుంది” అని అన్నారు.

మరోవైపు నిర్భయ కేసులో దోషులుగా ఉన్న ముకేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లు ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలుమార్లు వీరి ఊరి వాయిదా పడినప్పటికీ.. ఈ సారి అన్ని ప్రక్రియలు పూర్తైనందున చట్టప్రకారం వీరు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని న్యాయ నిపుణలు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version