బడ్జెట్ 2020 లో కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పథకం ఇదే..!

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నివేదికను నిర్మల సభ ముందుంచారు. తన ప్రసంగం సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంత్యోదయ పథకానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలిపారు. తన ప్రసంగం సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంత్యోదయ పథకానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పేదరిక నిర్మూలన, జీనవోపాధి పెంపు, నైపుణ్య శిక్షణ, ఉపాధి, ఆర్థిక చేయూత వంటి కార్యక్రమాలను చేపట్టబోతున్నామని చెప్పారు. నీటి లభ్యత అత్యంత తక్కువగా ఉన్న 100 జిల్లాలకు ప్రయోజనం కలిగించేలా పథకాలను చేబట్టబోతున్నామని తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరంలో మిషన్‌ అంత్యోదయపై రాష్ర్టాల అభిప్రాయాలను సేకరించిన కేంద్రం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనిని కార్యరూపంలోకి తెస్తోంది. అలాగే సోలార్ పంపు సెట్లను ప్రోత్సహిస్తామని చెప్పారు. మ‌రియు 15 లక్షల మందికి సోలార్ పంపు సెట్లను అందిస్తామని తెలిపారు. ప్రజల ఆదాయాన్ని పెంచేలా బడ్జెట్ ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. సంపదను సృష్టించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధిని కల్పిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news