రిటైర్మెంట్.. ఇప్పట్లో కుదరదు.. బీహార్ సీఎం కీలక వ్యాఖ్యలు..!

ఇటీవలే బీహార్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించింది. దీంతో నాలుగవసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించినప్పటికీ ముందు అనుకున్న విధంగా నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రి చేసేందుకు బీజేపీ సిద్ధమైంది.

అయితే బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవే చివరి ఎన్నికలు అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన నితీష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు… తన వ్యాఖ్యలను అందరు తప్పుగా అర్థం చేసుకున్నారని తనకు ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చారు నితీష్ కుమార్. ఎన్నికల ప్రచారంలో తాను మాట్లాడిన స్పీచ్ ను మరోసారి విని క్లారిటీ తెచ్చుకోవాలి అంటూ సూచించారు.