విరాట్ కోహ్లీ నిర్ణయం సరైనదే : ఆస్ట్రేలియా కోచ్

-

ఇటీవలే ఐపీఎల్ టోర్నీ ముగించుకున్న భారత జట్టు అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు మూడు టి20 టెస్టు సిరీస్ లు ఆడనుంది భారత జట్టు.కాగా భారత జట్టు కు సంబంధించిన వివరాలను బీసీసీఐ ప్రకటించింది కూడా. అయితే జనవరి నెలలో విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డెలివరీ సమయంలో భార్య కు తోడుగా ఉండడానికి పితృత్వ సెలవులను కోరాడు విరాట్ కోహ్లీ.

దీంతో ఒక టెస్ట్ సిరీస్ పూర్తయిన తర్వాత తిరిగి ఇండియాకు వచ్చేందుకు బీసీసీఐ విరాట్ కోహ్లీకి అనుమతిచ్చింది. ఇదే విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా కోచ్ లాంగాన్ విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. తన జీవితంలో చూసిన ఎంతో మంది ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమం అనడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ సెలవులు తీసుకుని తన భార్యకు తోడుగా ఉండాలి అనుకోవడం గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చాడు .

Read more RELATED
Recommended to you

Latest news