నటి నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తాను నటించింది తక్కువ సినిమాలే ఆయనప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ చిన్నది తాను వివాహం చేసుకోబోయే వ్యక్తితో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందని జోరుగా ప్రచారాలు సాగాయి. ఈ వార్తలపైన తాజాగా నివేదా పేతురాజ్ క్లారిటీ ఇచ్చారు. తాను ఇంకా ఎంగేజ్మెంట్ చేసుకోలేదని చెప్పింది.

అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ జరుగుతుందని, జనవరి నెలలో వివాహం చేసుకోబోతున్నామని నివేదా పేతురాజ్ అన్నారు. డేట్స్ ఇంకా ఫైనల్ కాలేదు. రాజ్ హిత్ ఇబ్రాన్ ను ఐదు సంవత్సరాల క్రితం దుబాయ్ లో కలిసాను. మేమిద్దరం మొదట మంచి స్నేహితులం అయ్యాము. ఆ తర్వాత పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నాము. వివాహం చేసుకోవాలని అనుకున్న తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించామని నివేదా పేర్కొన్నారు. రాజ్ హిత్ ఇబ్రాన్ కు దుబాయ్ లో వ్యాపారాలు ఉన్నాయని నివేదా పేర్కొన్నారు. ప్రస్తుతం నివేద షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.