టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యధావిధిగా తన సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే తన నానమ్మ, అల్లు అరవింద్ తల్లి కనక రత్నం మరణించిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ ముంబై నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చి రెండు రోజులు ఇంట్లోనే ఉన్నారు. మళ్లీ యధావిధిగా ఆదివారం రాత్రి తన బృందంతో కలిసి అల్లు అర్జున్ ముంబైకి తిరుగు ప్రయాణమయ్యారు.
డైరెక్టర్ అట్లీతో కలిసి అల్లు అర్జున్ సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ లో ఈరోజు నుంచి పాల్గొననున్నారు. కాగా అల్లు అర్జున్ రీసెంట్ గా నటించిన పుష్ప-2 సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కొద్దిరోజుల గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు అట్లితో కలిసి సినిమా చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.