ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదు : గోపాల్ రాయ్

-

పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేయగా ఇరు పార్టీలు కూడా ఒక్క స్థానాన్ని సొంతం చేసుకోలేదు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ స్థానాలను బిజెపి పార్టీ కైవసం చేసుకుంది.అయితే, ఈ రెండు పార్టీల పొత్తు గురించి ఆప్ నేత, మంత్రి గోపాల్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసమే పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని గోపాల్ రాయ్ తెలిపారు.

గురువారం ఢిల్లీలో సీఎం నివాసంలో ఆప్ ఎమ్మెల్యేల సమావేశం జరిగిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ఈ సమావేశంలో, ఆ పార్టీ శాసనసభ్యులు ప్రతి శని, ఆదివారాల్లో తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఢిల్లీలో అభివృద్ధి పనులు ఆగిపోయానని గోపాల్ రాయ్ వెల్లడించారు. శనివారం ఢిల్లీ కౌన్సిలర్ల సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. జూన్ 13న పార్టీ కార్యకర్తలు సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news