అస్సాం: షార్ట్ వేసుకున్నందుకు పరీక్షా హాల్ లోకి నో ఎంట్రీ..

ఆడవాళ్ళ డ్రెస్సుల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎలాంటి దుస్తులు ధరించాలన్న దగ్గర నుండి ఎక్కడ ఎలా ఉండాలనే వరకు ప్రతీ ఒక్కరూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ఈ విషయంలో వ్యక్తి స్వేఛ్ఛ గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది. ప్రస్తుతం అసోంలో జరిగిన సంఘటన మరోమారు ఆడవాళ్ల దుస్తుల గురించి చర్చించుకునేలా చేసింది. షార్ట్ వేసుకు వచ్చిందని పరీక్షా హాల్ లోకి ప్రవేశం ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ మొదలైంది.

అసోం యూనిరవర్సిటీ ప్రవేశ పరీక్ష రాయడానికి షార్ట్ వేసుకు వచ్చిన యువతిని అధికారులు పరీక్షా హాల్ లోకి రానివ్వలేదు. పరీక్ష రాయడానికి కావాల్సిన అన్ని పత్రాలు, అడ్మిట్ కార్డు చూపించినప్పటికీ అధికారులు పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వలేదు. అడ్మిట్ కార్డులో అలాంటి నిబంధన ఏమీ లేదని వాదించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి యువతి తండ్రి తీసుకువచ్చిన ఇతర డ్రెస్సును ధరించి పరీక్ష రాసింది.