తెరుచుకున్న శబరిమల ఆలయం.. అక్కడ మాస్క్ అక్కర్లేదట !

-

శబరిమలలో నేటి నుంచి మండల పూజ నిమిత్తం ఆలయం తెరుచుకుంది. శబరిమల భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం వర్చ్యువల్ క్యూలో రిజిస్టర్ చేసుకొని భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కొండ మీదకు వెళ్లేందుకు అనుమతి లేదని చెబుతున్నారు. అలాగే సోమవారం నుంచి శుక్రవారం వరకు వెయ్యి మంది భక్తులకు మాత్రమే కూడా స్లాట్లు జారీ చేయగా శని ఆదివారాల్లో మాత్రం రోజుకు రెండు వేల మందిని అనుమతిస్తున్నారు. ఇక కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పకుండా ఉంటేనే కొండమీదికి అనుమతించేలా అక్కడి యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటోంది. పంబా వద్ద ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ వద్దకు 24 గంటల లోపే చేయించిన నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటే, అక్కడ మరలా దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసిన ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది.

అక్కడ కూడా నెగిటివ్ వస్తే అలాంటి వారిని కొండమీదకు అనుమతించనున్నారు. ఒకవేళ అక్కడ పాజిటివ్ అని తేలితే వెంటనే కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారెంటైన్ సెంటర్లకు భక్తులను తరలించనున్నారు. అయితే కొండ మీదకి ఎక్కే సమయంలో మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు, ఎందుకంటే కొండ నిటారుగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మాస్కు పెట్టుకుని కొండెక్కితే శ్వాస కోసం ఇబ్బందులు తలెత్తాయి. అలా ఇబ్బంది పడే ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే అక్కడ మాత్రం కఠినమైన సోషల్ డిస్టెన్స్ పాటించాలని భక్తులకు సూచిస్తున్నారు. గతంలో లాగా నెయ్యాభిషేకా లు ఉండవు అని అలాగే సన్నిధానంలో బస చేసే అవకాశం కూడా ఉండదని, దర్శనం చేసుకున్న భక్తులు వెనువెంటనే కిందకి బయలుదేరేలా ఏర్పాట్లు చేస్తున్నామని ట్రావెన్కోర్ బోర్డు అధికారుల నుంచి సమాచారం అందుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news