ప్రజలకు దగ్గరగా ఉన్న వారికే ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఇది ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది.ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటూ ప్రజలకు అన్నివిధాలుగా మేలు చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. మళ్లీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారు ఏపీ ప్రజలు.ఎన్నికల నేపథ్యంలో సర్వే ఫలితాలు కూడా ఆయనకే అనుకూలంగా ఉన్నాయి. వైసీపీదే మళ్లీ అధికారమని తేల్చి చెబుతున్నాయి. ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ , సీ – ఓటర్ సర్వేలను మినహాయిస్తే మిగిలిన సర్వేలన్నీ వైసీపీ తిరిగి గెలవడం ఖాయమని తేల్చేశాయి. తాజాగా ఏపీ రాజకీయాలకు సంబంధించిన మరో సర్వే బయటకు వచ్చింది. ప్రముఖ జర్నలిస్ట్ రేణుక పోతినేని తమ సర్వే నివేదికను వెల్లడించారు.
ప్రముఖ జర్నలిస్ట్ గా ఉన్న రేణుక పోతినేని చేసిన సర్వేలో సైతం ప్రజలు వైసీపీకె పట్టం కట్టారు. 134 సీట్లు గెల్చుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని తన సర్వేలో ఆమె తెలిపారు. ఎన్డీయే కూటమి 41 సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. 52 శాతం ఓటు బ్యాంక్‌తో వైసీపీ 134 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని జర్నలిస్ట్ రేణుక పోతినేని సర్వే చెబుతోంది. మహిళలు 58 శాతం , పురుషులు 42 శాతం వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఆ సర్వే ద్వారా తేలింది.కూటమికి 45 సీట్లు కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చిసింది.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.ముఖ్యంగా అధికార వైసీపీని ఓడించడానికి రాజకీయ పార్టీలన్నీ ఏకం అయిన పరిస్థితిని ఏపీ ప్రజలు చూస్తున్నారు. జగన్‌ను ఢీ కొట్టడానికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు జత కట్టాయి. మూడు పార్టీలు జగన్ ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. మరోవైపు ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన తమదే గెలుపని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల సీఎం జగన్‌పై రాయి దాడి జరగడంతో రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. జగన్‌కు వస్తోన్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ వారే ఇలా దాడులు చేయించుకుని సింపతి క్రియేట్ చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు మాత్రం వైసీపీ వైపే ఉన్నారని సర్వేల ఫలితాలు చెప్తున్నాయి.తాజాగా రేణుక పోతినేని సర్వే కూడా ఇదే ఖరారు చేయడంతో వైసీపీ శ్రేణులు జోష్ లో ఉన్నాయి. అయితే ఈ సర్వేను టీడీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఇది వైసీపీ అనూకుల సర్వే అంటూ కూటమి నేతలు పెదవి విరుస్తున్నారు.