నేరం రుజువు అయితే మనవడిపై చర్యలు తీసుకునేందుకు అభ్యంతరం లేదు : దేవెగౌడ

-

కర్ణాటకలో సంచలనం రేపిన హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్ దేవెగౌడ ఎట్టకేలకు స్పందించారు. శనివారం మాట్లాడిన ఆయన తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ నేరం చేసినట్లుగా రుజువైతే అతనిపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే, తన కుమారుడు, జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచీ రేవణ్ణపై లైంగిక వేధింపులు, మహిళ కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులు క్రియేట్ చేశారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ విషయాలపై విచారణ జరుగుతున్నందున తదుపరి వ్యాఖ్యలు చేయడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు.

ఈ లైంగిక వేధింపుల కేసులో చాలా మంది ఉన్నారు. నేను ఎవరి పేరను తీసుకోకూడదనుకుంటున్నాను, ఈ విషయంలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని కుమారస్వామి అన్నారు. వారందరికీ, బాధిత మహిళలకు న్యాయం, పరిహారం అందాలని కోరుకుంటున్నాను, దోషిగా తేలితే ఎవరినీ విడిచిపెట్టకూడదని దేవెగౌడ అన్నారు. శనివారం 92 వ ఏట అడుగుపెట్టిన మాజీ ప్రధాని దేవెగౌడ తన పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నా కూడా వారి శుభాకాంక్షలు తనకు అందుతాయిని అన్నారు. 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయాడు. అతన్ని వెనక్కి తీసుకురావడానికి ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది

Read more RELATED
Recommended to you

Latest news