ఎలక్ట్రిక్ వాహనాలకు పర్మిట్ అక్కర్లేదు!

-

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని దేశంలో ప్రోత్సహించేలా కేంద్ర మరో నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే ఇతర ఆటోమొబైల్ వాహనాలకు పర్మిట్ మినహాయింపు కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇక నుంచి ఇథనాల్, బయోడీజిల్; సీఎన్జీ, జీవ ఇంధనం లాంటి ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే ఆటోరిక్షాలు,బస్సులు, టాక్సీలకు పర్మిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్రతిపాదనకు రాష్ట్రాలు సై అనడంతో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీంతో దేశంలో విద్యుత్ వాహనాల కోనుగోలు, ఉత్పత్తి పెరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news