జపాన్ లో రికార్డులు సృష్టిస్తున్న ‘మగధీర’

-

అదేంటి 2009లో వచ్చిన మగధీర ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేయడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ఒకవేళ యూట్యూబ్ లో మగధీర రికార్డులు క్రియేట్ చేస్తుందా అంటే అలాంటిది కాదు కాని పర దేశంలో మగధీర రికార్డులు సృష్టిస్తుంది. బాహుబలి సినిమా తర్వాత ఇండియన్ సినిమాల మీద మిగతా దేశాల కన్ను పడింది. ఆ సినిమా ఇండియన్ స్క్రీన్ మీదనే కాదు చైనా, జపాన్ వండి దేశాల్లో కూడా రికార్డులు సృష్టించింది.

ఇక ఇప్పుడు మగధీర వంతు వచ్చింది. ఈ సినిమా కూడా జపాన్ లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 1.06 మిలియన్ డాలర్స్ వసూళ్లు రాబట్టిందట. బాహుబలి సినిమా టోటల్ రన్ లోనే 1.3 మిలియన్ దాకా వసూళు చేసింది. జపాన్ లో ఇండియన్ సినిమాల్లో ముత్తు 3 మిలియన్ డాలర్స్ తో రికార్డ్ సృష్టించింది. ఇదే అక్కడ టాప్ కలక్షన్స్. అందుకే జపాన్ లో రజినికి ఇప్పటికి క్రేజ్ ఉంటుంది.

మగధీర సినిమా కూడా రాజమౌళి డైరక్షన్ లో వచ్చింది. బాహుబలి తర్వాత రాజమౌళి ఎన్.టి.ఆర్, రాం చరణ్ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news