నాసా చాలెంజ్ లో పాల్గొని ఏడు కోట్లు గెలుచుకోవాలనుందా?

-

నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ తెలుసు కదా. అంతరిక్ష పరిశోధనలో ఆరితేరిన సంస్థ ఇది. ఎన్నో రాకెట్లను స్పేస్ లోకి పంపించి విశ్వంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంటుంది. మన దేశంలోని ఇస్రో కూడా అప్పుడప్పుడు అంతరిక్ష పరిశోధనల్లో నాసా సాయం తీసుకుంటుంది. అయితే.. నాసా త్వరలో అంగారక గ్రహంపై కాలు మోపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నది. అంగారక గ్రహంపై నిజంగా మానవ మనుగడ సాధ్యమేనా? అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? అనే విషయాలపై కొంతమంది రీసెర్చర్లకు సవాల్ విసిరింది.

ఆ సవాల్ కంటే ముందు.. మనం ఇంకో విషయం గురించి తెలుసుకోవాలి. భూమ్మీద ఉన్న వాయువుల్లో కార్బన్ డయాక్సైజ్ చాలా విషపూరితమైనది. దాన్నే సీవోటూ అంటాం అని తెలుసు కదా. అయితే.. దీన్ని భూమ్మీద లేకుండా చేయడానికి సైంటిస్టులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సీవోటూ పెరగడానికి గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక కారణం. అయితే అంగారక గ్రహంపై అత్యధిక శాతం కార్బన్ డై ఆక్సైడే ఉందట. మరి.. అక్కడ సీవోటూ ఎక్కువగా ఉండటం వల్ల మనిషి మనుగడ కష్టమై పోతుంది కదా. అందుకే.. ఆ కార్బన్ డైయాక్సైడ్ ను నిర్వీర్యం చేసి మనుషులకు ఉపయోగపడేలా చేయడమే ఈ సవాల్ కాన్సెప్ట్. అలా చేసిన వారికి నాసా ఒక మిలియన్ డాలర్ల బహుమానం ఇస్తుందట. అంటే మన కరెన్సీలో దాదాపు 7 కోట్లు అన్నమాట.

అలా చేయడం వల్ల భూమ్మీద ఉన్న సీవోటూను కూడా తగ్గించే అవకాశం కల్గుతుందని నాసా అభిప్రాయపడింది. అంటే.. దీని వల్ల రెండు రకాల లాభాలు ఉంటాయని.. అందుకే ఈ చాలెంజ్ అంటూ తెలిపింది. అది సక్సెస్ అయితే కనుక.. అంగారకుడిపైకి వెళ్లే వ్యోమగాములు.. అక్కడే ఉండి పరిశోధనలు చేయడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల అంగారకుడిపై జీవనం గురించి ఇంకాస్త ఆసక్తికరమైన విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. మరి.. ఈ చాలెంజ్ లో మీరు పాల్గొంటారా? ఆలోచించండి.. ఒక్క కోటి కాదు.. రెండు కోట్లు కాదు.. ఏడు కోట్లు. కొడితే లైఫ్ సెట్ అయి పోద్ది.. ఏమంటారు.

Read more RELATED
Recommended to you

Latest news