కేటీఆర్ విషయంలో అస్సలు తగ్గను : మంత్రి కొండా

-

నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన అసభ్య వ్యాఖ్యల పట్ల పలువురు సినీ ప్రముఖులు ఘాటుగా స్పందిస్తున్నారు. మంత్రి పదవిలో ఉన్న మహిళ మరో మహిళ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం తగదని హితవు పలుకుతున్నారు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను వివాదాల్లోకి లాగడం సరికాదని విమర్శిస్తున్నారు. వెంటనే మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంతో పాటు నటి సమంతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా తను చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించారు.తనకు జరిగిన అవమానంతో ఆవేదనకు గురై ఇలా మాట్లాడినట్లు తెలిపారు.సమంతపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఆవేదన చెందానని, అందుకే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. కానీ, కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ప్రస్తక్తే లేదని, తనను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆమె ఫైర్ అయ్యారు. ఆయన పరువు నష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.తన కోపం కేటీఆర్‌ మీదే ఉంటుందని, ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news