తబ్లిగీ పోయే రంజాన్ వచ్చే… ఏపీలో షాకింగ్ సంఘటన!

-

కరోనా వచ్చిన కొత్తల్లో దేశం మొత్తం మీద అతితక్కువ కేసులే నమోదయ్యాయి. ఏదో విదేశాలన్నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ కు పంపేస్తే చాలు… అంతా రిలాక్స్ అయిపోవచ్చని అంతా భావించారు. ఇంతలోనే ఢిల్లీలోని తబ్లిగీ సంఆచారం వైరస్ కంటే వేగంగా దేశం మొత్తం వ్యాప్తించింది.. ప్రజలు ఒక్కసారిగా ఆందోలన చెందడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో.. సరే అయిందేదో అయిపోయింది.. కరోనా వ్యాప్తికి ఒక వర్గాన్ని నిందించడం ఏమాత్రం సరికాదని అంతా సంయమనం పాటించారు. ఆసంగతి అలా ఉంచితే… ఇప్పుడు రంజాన్ మాసం మొదలవడంతో కథ మళ్లీ మొదటికొచ్చే పరిస్థితి తలెత్తబోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా వాసులు!

అవును… రంజాన్ సందర్భంగా సామూహిక ప్రార్ధనలు వద్దంటూ అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ముస్లింలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ముస్లిం మత పెద్దలు, ఇమామ్ లతో సందేశాలిప్పించారు అధికారులు. ఈ రంజాన్ టైం లో మసీదులలోని ప్రార్థనలకు ఇమామ్, మౌజమ్.. మరో ఇద్దరికి మాత్రమే అనుమతి అంటూ రూల్స్ పాస్ చేశారు. ఇదే సమయంలో ఏపీలో ముస్లింలకోసం ప్రత్యేకంగా సాయంత్రం పూట కూడా డ్రైఫ్రూట్ షాప్స్ ఓపెన్ చేయిస్తున్నారు. ఇన్ని చేసినా… మళ్లీ వ్యవహారం మొదటికే వచ్చింది!

రంజాన్ మాసం మొదటిరోజే.. నెల్లూరు జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించారనే వార్తలు ఏపీ వాసులను హడలెత్తిస్తున్నాయి. నెల్లూరు నగరంలోని మసీదుకి ప్రార్థనల కోసం జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. సోషల్ డిస్టెన్స్ సంగతి కాసేపు పక్కన పెడితే… ఏకంగా మతపెద్దగా ఉన్న వ్యక్తి చేతిని మసీదుకి వచ్చిన భక్తులంతా వరుసపెట్టి ముద్దుపెట్టుకుంటూ తమ భక్తి భావాన్ని చాటుకున్నారట. మిగిలిన రోజుల్లో అయితే ఈ వ్యవహారం వారి మతాచారం కాబట్టి ఎవరూ ఆక్షేపించరు, కానీ… సోషల్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ అని ఒకవైపు ప్రభుత్వాలు చెబుతుంటే… నోటి తుంపర్ల ద్వారానే కరోనా వ్యాప్తిస్తుందని మొత్తుకుంటుంటే… వీరు ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news