Kajal Agarwal: చిరంజీవి హీరోయిన్‌ది కీ రోల్ కాదా?..‘ఆచార్య’ ట్రైలర్‌లో కనిపించని కాజల్ అగర్వాల్

-

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య’ ట్రైలర్ చూసి మెగా అభిమానులు సంబురపడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ డెఫినెట్ గా బాక్సాఫీసు వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందని అంటున్నారు. తండ్రీ తనయులు చిరంజీవి -రామ్ చరణ్ పాత్రలను దర్శకులు మలిచిన తీరు ట్రైలర్ లో స్పష్టంగా తెలుస్తున్నది.

సగటు సినీ ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే కొరటాల శివ.. తన చిత్రాలతో సామాజిక సందేశాలు కూడా ఇస్తుంటారు. కాగా, ఈ సినిమా ట్రైలర్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కనిపించకపోవడం వెనుక చర్చ జరుగుతున్నది.

ఫేమస్ టాలీవుడ్ రైటర్ అయిన కొరటాల శివ సినిమా స్టోరిల్లో హీరోయిన్స్ రోల్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. గత చిత్రాలను చూస్తే ఈ విషయం మనకు స్పషత వస్తుంది. కాగా, ‘ఆచార్య’ ట్రైలర్ చూస్తుంటే మాత్రం కాజల్ అగర్వాల్ సినిమాలో అంతగా ప్రయారిటీ లేదా? అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకే ఈ సినిమాను సీనియర్ హీరోయిన్ త్రిష రిజెక్ట్ చేసిందా? అని కామెంట్స్ కూడా చేస్తు్న్నారు కొందరు.

ట్రైలర్ లో రామ్ చరణ్ కు జంటగా పూజా హెగ్డే కనిపించింది. కానీ, చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ కనిపించలేదు. ఈ విషయమై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చిరంజీవి- రామ్ చరణ్ ల ను వెండితెరపైన చూసి అభిమానులు సంతోష పడుతున్నారు. కాజల్ అగర్వాల్ పాత్ర కూడా కీలకమైనప్పటికీ బహుశా ట్రైలర్ కట్ లో స్పేస్ లభించలేదేమోనని పలువురు అనుకుంటున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news