భక్తులకి నిరాశే : ఈ ఏడాది తెప్పోత్సవం లేనట్టే.. కానీ !

-

ప్రతి ఏడాది దుర్గమ్మ కృష్ణా విహారాన్ని చూసి సంతోష పడే భక్తులకి ఈ సారి నిరాశ ఎదురు కానుంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం కొనసాగుతుండడంతో నదిలో తెప్పోత్సవానికి వీలు కాదు. దీంతో ఫంట్ మీద అమ్మ వారికి పూజలు మాత్రమే నిర్వహించాలని కో ఆర్డినేషన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, సిపి బత్తిన శ్రీనివాసులు, ఇతర అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున స్వల్ప మార్పులతో తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయించామని కలెక్టర్ తెలిపారు.

అయితే నదిలో విహారం లేకుండానే ఈసారి తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. తెప్పోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం కృష్ణా నదిలో దుర్గా మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు యథాతథంగా పూజలు నిర్వహిస్తామని అన్నారు. పరిమిత సంఖ్యలో అర్చకులతో నదిలో అమ్మ,స్వామివార్ల ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. తెప్పోత్సవం నిర్వహించే పంటు సామర్థ్యాన్ని తనిఖీ చేసి ఫిట్ నెస్ దృవపత్రం తీసుకున్నాకే అనుమతిస్తామని ఆయన అన్నారు. తెప్పోత్సవం జరుగుతున్నంత సేపు కొత్తగా నిర్మించిన కనకదుర్గ పై వంతెనల పై వాహనాలు, భక్తులు రాకపోకలు ఆపేస్తామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news