నోకియా నుంచి రెండు కొత్త ఫీచ‌ర్ ఫోన్లు..! ధ‌ర‌లెంతంటే..?

-

హెచ్ఎండీ గ్లోబ‌ల్ కంపెనీ నోకియా 125, 150 పేరిట రెండు కొత్త ఫీచ‌ర్ ఫోన్ల‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. నోకియా 125 ఫోన్‌లో 2.4 ఇంచుల డిస్‌ప్లే, మీడియాటెక్ ప్రాసెస‌ర్‌, నోకియా సిరీస్ 30 ప్ల‌స్ ఓఎస్‌, 4ఎంబీ ఇంటర్న‌ల్ స్టోరేజ్‌, వీజీఏ కెమెరా, వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో, డ్యుయ‌ల్ సిమ్‌, 1020 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 23.4 వ‌రకు స్టాండ్ బై టైం త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Nokia 125 and  Nokia 150 feature phones launched in india

నోకియా 150 (2020) ఫీచ‌ర్ ఫోన్‌లో 2.4 ఇంచుల డిస్‌ప్లే, మీడియాటెక్ ప్రాసెస‌ర్‌, నోకియా సిరీస్ 30 ప్ల‌స్ ఓఎస్‌, 4ఎంబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 32 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్ మెమొరీ, వీజీఏ కెమెరా విత్ ఫ్లాష్‌, వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయ‌ర్‌, డ్యుయ‌ల్ సిమ్‌, బ్లూటూత్ 3.0, 1020 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 23 రోజుల వ‌ర‌కు స్టాండ్ బై టైం త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

నోకియా 125 ఫోన్ చార్‌కోల్ బ్లాక్‌, పౌడ‌ర్ వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా దీని ధ‌ర‌రూ.1,999గా ఉంది. నోకియా 150 ఫోన్ రెడ్‌, క్యాన్‌, బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో విడుద‌ల కాగా రూ.2,299 ధ‌ర‌కు ఈ ఫోన్ ల‌భిస్తోంది. ఈ రెండు ఫోన్ల‌ను వినియోగ‌దారులు ప్ర‌స్తుతం కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news