కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (25-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో మంగ‌ళ‌‌వారం (25-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 25th august 2020

1. దేశంలో కొత్త‌గా 60,975 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 31,67,324కు చేరుకుంది. 24,04,585 మంది కోలుకున్నారు. 7,04,348 మంది చికిత్స పొందుతున్నారు. 58,390 మంది చ‌నిపోయారు.

2. తెలంగాణ‌లో కొత్త‌గా 2,579 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,08,670కు చేరుకుంది. 23,737 మంది చికిత్స పొందుతున్నారు. 84,163 మంది కోలుకున్నారు. 770 మంది చ‌నిపోయారు.

3. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ జ‌ట్టు ప్లేయ‌ర్లు బీసీసీఐ సూచించిన మేర నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని ఆ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. మంగ‌ళ‌వారం కోహ్లి త‌న టీం మేట్ల‌తో నిర్వ‌హించిన వ‌ర్చువ‌ల్ మీటింగ్‌లో పాల్గొన్నాడు. ఒక్క‌రు త‌ప్పు చేసినా కోవిడ్ బారిన ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని హెచ్చ‌రించాడు.

4. ఏపీలో కొత్త‌గా 9,927 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,71,639కు చేరుకుంది. 89,932 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,78,247 మంది కోలుకున్నారు. 3,460 మంది చ‌నిపోయారు.

5. క‌ర్ణాట‌క‌లో కొత్గా 8,161 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,91,826కు చేరుకుంది. 2,04,439 మంది కోలుకున్నారు. 82,410 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,958 మంది చ‌నిపోయారు.

6. ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ రూపొందించిన కోవిషీల్డ్ క‌రోనా వ్యాక్సిన్‌కు దేశంలో మంగ‌ళ‌వారం క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మ‌య్యాయి. సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ ట్ర‌య‌ల్స్ చేప‌డుతోంది. మొద‌టి విడ‌తలో 18 ఏళ్లు నిండిన ఆరోగ్య‌వంత‌మైన 350 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

7. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 10,425 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7,03,823కు చేరుకుంది. 5,14,790 మంది కోలుకున్నారు. 1,65,921 మంది చికిత్స పొందుతున్నారు.

8. క‌రోనా నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో స్కూళ్ల‌ను ఓపెన్ చేయ‌లేమ‌ని కేంద్రం తెలిపింది. అన్‌లాక్ 4.0 సెప్టెంబ‌ర్ 1 నుంచి ప్రారంభ‌మైనా స్కూళ్ల‌ను తెరిచే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ తెలిపారు.

9. క‌రోనా చికిత్స‌కు ధైర్య‌మే అస‌లైన మంద‌ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఎంత మంది వ‌చ్చినా క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తామ‌న్నారు. కేంద్రం అనుమ‌తిస్తేనే స్కూళ్ల‌ను తెరుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

10. హాంగ్‌కాంగ్‌లో క‌రోనా కేసులు త‌గ్గుతుండ‌డంతో అక్క‌డ ప‌లు క‌రోనా ఆంక్ష‌ల‌కు స‌డ‌లింపులు ఇవ్వ‌నున్నారు. సాయంత్రం వేళల్లో రెస్టారెంట్ల‌కు అనుమ‌తి ఉంటుంది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్కులు లేకున్నా వ్యాయామం చేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news