నోకియా మీడియా స్ట్రీమ‌ర్ బాక్స్‌ను లాంచ్ చేసిన ఫ్లిప్‌కార్ట్‌.. ధ‌ర చాలా త‌క్కువ‌..!

-

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నూత‌నంగా నోకియా మీడియా స్ట్రీమ‌ర్ బాక్స్‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. 60 ఎఫ్‌పీఎస్ స్పీడ్‌తో ఈ బాక్స్ ద్వారా ఫుల్‌ హెచ్‌డీలో వీడియోలు ప్లే చేయ‌వ‌చ్చు. డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫైని అందిస్తున్నారు. అందువ‌ల్ల వైఫై సిగ్న‌ల్‌ని చ‌క్క‌గా రిసీవ్ చేసుకుంటుంది. డాల్బీ డిజిట‌ల్ ఆడియో, వాయిస్ కంట్రోల్డ్ రిమోట్‌, గూగుల్ అసిస్టెంట్‌కు స‌పోర్ట్ ఫీచ‌ర్ల‌ను కూడా ఇందులో అందిస్తున్నారు.

Nokia Media Streamer box launched by flipkart

ఈ బాక్స్‌లో బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్లు త‌దిత‌ర డివైస్‌ల‌ను దీనికి క‌నెక్ట్ చేసి వాటిలో ఉన్న కంటెంట్‌ను ఈ బాక్స్ ద్వారా స్ట్రీమ్ చేయ‌వ‌చ్చు. ఇక గూగుల్ ప్లేకు ఈ బాక్స్‌లో స‌పోర్ట్‌ను ఇస్తున్నారు. జీ5, నెట్‌ఫ్లిక్స్ త‌దిత‌ర యాప్స్‌ను వేగంగా యాక్సెస్ చేసేందుకు గాను ప్ర‌త్యేక కీస్ ను అందిస్తున్నారు.

నోకియా మీడియా స్ట్రీమ‌ర్ బాక్స్‌లో క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్‌ల‌ను అందిస్తున్నారు. ఈ బాక్స్ ధ‌ర రూ.3499గా ఉంది. ఆగ‌స్టు 28 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news