అంతే ఇంకా ఆ బాలుడు జుట్టుని క్యాన్సర్ రోగులకు దానం చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు.యూకేకు చెందిన ఓ 9 ఏళ్ల బాలుడు చిన్నప్పటినుంచి జట్టు కత్తిరించుకోలేదు. అతని జుట్టు చూస్తే రాతి యుగం నాటి మనిషి లా ఉండే వాడు.చిన్నవయసులో పెద్దమనసు చాటుకున్నాడు. సోషల్ మీడియాలో అందరి ప్రశంసలూ పొందాడు.
ఆ బాలుడు కి రెండు అడుగులు కన్న ఎక్కువ జుట్టు ఉండేది. దానికి చూస్తూ ఎప్పుడు ఆనందపడే వాడు. ఆ బాలుడు పేరు రీల్లీ .క్యాన్సర్ కారణంగా జుట్టు కోల్పోయిన పిల్లల చిత్రాలను చూసిన తర్వాత ఇవన్నీ కత్తిరించాలని నిర్ణయించుకున్నాడు.లిటిల్ ప్రిన్సెస్ ట్రస్ట్ అనే సంస్థకు విరాళంగా ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ సంస్థ క్యాన్సర్ రోగులకు జుట్టు సేకరించి విగ్ రూపంలో రోగులకు అందజేస్తుంది. అతి చిన్న వయసులో ఇంత పెద్ద మనసుతో ఆలోచించి ఈ విధంగా క్యాన్సర్ రోగులకు జుట్టు ఇవ్వడం ఎంతో గొప్ప విషయం అని అందరూ అంటున్నారు.