ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, నోకియాలు కలిసి భారత్‌లో నోకియా ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే సదరు ల్యాప్‌టాప్‌ల గురించి ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే టీజర్‌ను విడుదల చేసింది. ఇక చెప్పినట్లుగానే తొలి నోకియా ల్యాప్‌టాప్‌ను విడుదల చేశారు. నోకియా ప్యూర్ బుక్ ఎక్స్14 పేరిట ఆ ల్యాప్‌టాప్ విడుదలైంది. ఇందులో 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. డాల్బీ విజన్, అల్ట్రా వివిద్ పిక్చర్ క్వాలిటీ, ఇంటెల్ కోర్ ఐ5 10వ జనరేషన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ తదితర ఫీచర్లను ఈ ల్యాప్‌టాప్‌లో అందిస్తున్నారు.
నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్14 ల్యాప్‌టాప్‌లో డాల్బీ అట్మోస్ ఫీచర్ కూడా ఉంది. అందువల్ల హెడ్ ఫోన్స్‌తో నాణ్యమైన సౌండ్ క్వాలిటీ లభిస్తుంది. విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో ఇచ్చారు. హెచ్‌డీ వెబ్ క్యామ్ ఉంది. విండోస్ హలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందిస్తున్నారు.
నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్14 ఫీచర్లు…
* 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ బ్యాక్‌లిట్ ఐపీఎస్ డిస్‌ప్లే
* 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డాల్బీ విజన్
* 1.6 గిగాహెడ్జ్ ఇంటెల్ కోర్ ఐ5-10210యు ప్రాసెసర్, ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్ 620
* 8జీబీ డీడీఆర్4 ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ, హెచ్‌డీ ఐఆర్ వెబ్‌క్యామ్
* బిల్టిన్ డ్యుయల్ మైక్రోఫోన్, బ్యాక్‌లిట్ కీబోర్డ్, విండోస్ 10 హోం ఎడిషన్ ఓఎస్
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, హెచ్‌డీఎంఐ
* డాల్బీ అట్మోస్, 8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్14 ల్యాప్‌టాప్ ధర రూ.59,990 ఉండగా దీన్ని డిసెంబర్ 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు.