బట్టతలతో హీరో తిప్పలు.. ’నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్

-

అవసరాల శ్రీనివాస్ కి నటుడిగా మరియు రచయితగా మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రచయితగా పని చేస్తూ, కథానాయకుడి పాత్రను పోషించిన చిత్రంగా “నూటొక్క జిల్లాల అందగాడు” రూపొందింది. సాగర్ రాచకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమాలో హీరో బట్టతల సమస్యతో బాధపడుతూ ఉంటాడు.

బట్టతల ఉంటే పెళ్లి కాదని భావించి… విగ్గు పెట్టుకుంటాడు హీరో అవసరాల శ్రీనివాస్. తాను ప్రేమించిన అమ్మాయి దగ్గర ఆ నిజాన్ని దాచడానికి నానా తంటాలు పడుతూ ఉంటాడు. ఇలా బట్టతల కారణంగా ఇబ్బందులు పడుతూ అందులోనే నవ్వులు పూయించే కథగా ఈ సినిమా రూపొందింది. అవసరాల శ్రీనివాస్ సరసన గృహాన్ని శర్మ నటించగా.. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మించిన ఈ సినిమాను వచ్చే నెల 3వ తేదీన విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news