తిమింగళాలను చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా?

-

ఈ భూమ్మీద అత్యంత పెద్దదైన జీవి ఏదైనా ఉందంటే అది తిమింగలమే. టన్నులు టన్నులు బరువుగా ఉండే తిమింగళాలు సముద్రంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. వాటిని చూడడం అంత తేలిక కాదు. ఎప్పుడో ఓ సారి సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన తిమింగలం అని వార్తల్లో రావడమే తప్ప సముద్ర యానం చేసే వారికి కూడా తిమింగళాలు కనిపించడం చాలా తక్కువ. ఐతే మీకు పర్యాటకం అంటే ఇష్టమా? సముద్ర జీవులని ప్రత్యక్షంగా చూడాలని ఉందా? భూమ్మీద అతి పెద్ద జీవిని చూడాలని అనిపిస్తుందా? మాతో వచ్చేయండి. నీలాల నీటిలో తేలియాడుతున్న తిమింగళాలను మీకు పరిచయం చేయిస్తాము.

హర్మానస్- దక్షిణాఫ్రికా

వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వారిచే గుర్తింపబడ్డ ఈ ప్రాంతం తిమింగళాల సందర్శనకు చాలా మేలైనది. సముద్రపు అంచున ఉన్న కొండ మీద తిమింగళాలను చూడవచ్చు. జులై నుండి సెప్టెంబరు నెలలో ఈ తిమింగళాల దర్శనం బాగుంటుంది.

మిరిస్సా- శ్రీలంక

తిమింగళాలే కాదు డాల్ఫిన్లను కూడా చూడడానికి అనువైన ప్రదేశం మిరిస్సా. ఇక్కడ సముద్ర సఫారీ అందుబాటులో ఉంది. ప్రత్యేకమైన ఓడల ద్వారా డాల్ఫిన్లు, తిమింగళాఉ తిరిగే ప్రదేశాల్లో తిప్పుతారు. నవంబరు నుండి ఏప్రిల్ మధ్య కాలంలో ఈ పర్యటన అనుకూలంగా ఉంటుంది. అత్యంత పెద్దదైన తిమింగళాలను ఇక్కడ చూడవచ్చు.

వాన్ కోవర్ దీవి- కెనడా

తిమింగళాలను ఖచ్చితంగా చూడాలంటే ఈ ప్రదేశాలను దర్శించవచ్చు. తిమింగళాలే కాదు, సముద్ర సింహాలు, గద్దలు మొదలగు వాటిని చూడడం చాలా సాహసంగా ఉంటుంది.

హుసావిక్- ఐస్లాండ్

ప్రపంచంలోనే అత్యంత సాహసవంతమైన పర్యాటక ప్రాంతంగా హుసావిక్ గుర్తింపు పొందింది. తిమింగళాలను చూడడంలో సాహసోపేతమైన పర్యాటకంగా ఇది నిలుస్తుంది. నీలి తిమింగళాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సాధారణంగా కాకుండా అర్థరాత్రి తిమింగళాలను చూసే అవకాశం ఉంటుంది. అందుకే చాలా థ్రిల్లింగ్ అనుభూతి కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news