‘కొరియా ద్వీపకల్వం ఏ క్షణమైనా పేలిపోతుంది’

-

అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలతో కొరియా ద్వీపకల్పం గరంగరంగా మారింది. యుద్ధ విన్యాసాలతో ఆ ప్రాంతమంతా ఆయుధ సామగ్రితో నిండిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ఏ క్షణమైనా ఆ ద్వీపకల్పం పేలిపోవచ్చని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మరోవైపు అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. ఖండిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా క్షిపణి ప్రయోగాలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఉత్తరకొరియా తీవ్ర హెచ్చరికలు చేసింది. అమెరికా-దక్షిణ కొరియా విన్యాసాల ద్వారా ఉద్రిక్తతలు పెంచుతున్నాయని, అణుయుద్ధం అంచుకు నెడుతున్నాయని మండిపడింది. ఈ రెచ్చగొట్టే చర్యలకు తగినస్థాయిలో సమాధానం ఉంటుందని ఉ.కొరియా స్పందించింది.

‘‘ఉ.కొరియాకు వ్యతిరేకంగా అమెరికా, దాని మిత్రదేశాల నిర్లక్ష్య సైనిక ఘర్షణలు.. కొరియా ద్వీపకల్ప ప్రాంతాన్ని వినాశకర అణు యుద్ధం అంచుకు నడిపిస్తున్నాయి. ఈ ప్రాంతంపై వేలాడుతున్న అణుయుద్ధ మేఘాలు సాధ్యమైనంత త్వరగా తొలగిపోవాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. యుద్ధ విన్యాసాల వల్ల ఈ ప్రాంతం ఆయుధ సామాగ్రితో నిండిపోయింది. అది ఏ క్షణమైనా పేలిపోతుంది’’ అని ఉత్తర కొరియా మీడియా సంస్థ కేసీఎన్‌ఏ కథనాన్ని ప్రచురించింది.

Read more RELATED
Recommended to you

Latest news