సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు

-

అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్ 5 జోన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రైతులు. రైతుల పిటిషన్ పై సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పిటిషన్ ని ఈనెల 14న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సోమవారం(10న) నాడే విచారణ తీసుకోవాలని రైతుల తరపు న్యాయవాదులు కోరారు.

రాష్ట్ర హైకోర్టులో ఆర్5 జోన్ పై మద్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు రైతులు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు పై హైకోర్టును ఆశ్రయించారు. కానీ రైతుల పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆరోజు కేసుల జాబితా ఇప్పటికే తయారైందని, విచారించాల్సిన కేసులు చాలా ఉన్నాయి కాబట్టి 14న విచారణకు తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూడ్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news