AC Vs Coolers: ఈ వేసవిలో ఏం కొనాలా అని ఆలోచిస్తున్నారా..? ఏ గాలి ప్రమాదం.. ఏది బెస్ట్….!!

-

వేసవికి చాలా మంది వేడిని తట్టుకో లేక ఏసీ లని కానీ కూలర్ల ని కానీ కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారు. పైగా ఫ్యాన్లు కూడా అలా తిరుగుతూనే ఉంటాయి. ఈ వేసవి కి మీరు కూలర్ ని కొనాలా ఏసిని కొనాలా అని ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఎక్కువ మందిలో ఉండే సందేహం ఏంటంటే ఏ గాలి మంచిది అని.. ఏసి నుండి వచ్చే గాలి మంచిదా లేదంటే కూలర్ నుండి వచ్చే గాలి మంచిదా అని… మీరు కూడా ఏది మంచిదా అని ఆలోచిస్తున్నారా అయితే తప్పకుండా ఈ విషయాలని చూడాల్సిందే.

ఏసీ నుండి వచ్చే గాలి చల్లగా ఉంటుంది. అయితే ఎయిర్ కండిషనర్ గదిలో ఒకే గాలిని తీసుకుంటుంది దానిని చల్లగా మార్చి బయటకు పంపుతుంది. అందుకే గాలి పొడిగా ఉంటుంది కానీ కూలర్ అయితే తాజా గాలిని తీసుకుంటుంది. గాలిని చల్లబరిచి చల్లని తాజా గాలిని మనకి ఇస్తుంది. గమనిస్తే మనం ఈ గాలి తేమతో కూడుకొని ఉంటుంది. కాబట్టి మనం కూలర్ లో వచ్చే గాలి నాణ్యమైనది అని చెప్పచ్చు. ఎంత నాణ్యమైనది అంటే ఇది 100% నాణ్యమైనది. ఎయిర్ కూలర్ గాలి నాచురల్ గా ఉంటుంది.

కూలర్ల లో గాలి చల్లగా మారటానికి నీళ్లు కూడా కావాలి. ఆస్తమా డస్ట్ ఎలర్జీ మొదలైన సమస్యలతో బాధపడే వాళ్ళకి కూలర్ గాలే మంచిది. ఏసీ గాలి కంటే కూలర్ గాలి స్వచ్ఛమైనది కాబట్టి కూలర్ ని కొనుగోలు చేయడం మంచిది. పైగా ఏసీలో ఉండే క్లోరోఫ్లోరో కార్బన్ హైడ్రోక్లోరో క్లోరో ఫ్లోరా కార్బన్ పర్యావరణానికి కూడా హాని చేస్తాయి. ఓజోన్ లేయర్ కూడా వీటి వల్ల దెబ్బతింటుంది. శ్వాస కి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ గాలి ఎంతో ప్రమాదం. ఏసీ కొనుగోలు చేయాలా లేకపోతే కూలర్ ని కొనుగోలు చేయాలని ఆలోచించే వాళ్ళు ఈ విషయాలని దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news