పెళైన తర్వాతే ఒక మనిషి ఎలాంటి వారు అనేది తెలుస్తుంది. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెళ్లి తర్వాత మనుషులు మారతారు. అయితే ఆ మార్పు మెల్లిమెల్లిగా కనిపిస్తుంది.. పెళ్లైన రెండు నెలలకో, ఆరునెలలకో, సంవత్సరానికో అట్లా.. కానీ ఇక్కడ మాత్రం..పెళ్లైన మరుసటి రోజే ఆ వధూవరుల మధ్య గొడవ స్టాట్ అయింది.. పెళ్లై 48 గంటలు కూడా గడవకుండానే.. భార్యతో గొడవపడి.. ఆమెను చంపి తను కూడా చనిపోయాడు. పెళ్లికి వేసిన పందిరి ఇంకా తీయనే లేదు.. చుట్టాలు ఇంకా వెళ్లనే లేదు. కానీ వధూవరులు మాత్రం శ్మశానికి వెళ్లిపోయారు.. ఈ దారుణమైన ఘటన ఛత్తీస్‌గడ్‌లో జరిగింది..
రాయ్‌పూర్ బ్రీజ్‌నగర్‌లో అస్లాం అనే 24 సంవత్సరాల యువకుడు, కహకషా బానో అనే 21సంవత్సరాల యువతిని ఆదివారం వివాహం చేసుకున్నాడు. వీరి రిసెప్షన్‌ని ఇరు కుటుంబ సభ్యులు కలిసి మంగళవారం రాత్రి జరపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే రిసెప్షన్‌కి ముందు నూతన దంపతులు రెడీ అయ్యేందుకు గదిలోకి వెళ్లారు. అక్కడ ఇద్దరు గొడవపడ్డారు. పెళ్లి కూతురు మాటలు భరించలేకపోయిన అస్లాం కత్తితో ఆమెపై దాడి చేసాడు. కత్తిపోట్లకు గురైన వధువు గట్టిగా అరవడంతో కుటుంబ సభ్యులు తలుపులు తట్టారు. లోపల గడియపెట్టడంతో కిటికీలోంచి గదిలో జరిగిన దారుణాన్ని కళ్లారా చూసి షాక్ అయ్యారు.
పెళ్లి కూతురు కహకషా బానోను కత్తితో పొడిచి చంపిన పెళ్లి కొడుకు తర్వాత తనకు తానే పొడుచుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఇద్దరూ రక్తపు మడుగులో పడిఉన్నారు.. బంధువులు పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. తిక్రాపరా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు.. ప్రాథమిక విచారణలో వరుడే పెళ్లి కూతుర్ని చంపి అటుపై తాను ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించారు. తలుపులు పగలగొట్టి మృతదేహాల్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటనతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.. పెళ్లిచేసుకుని జీవితాంత కలిసి ఉండాల్సిన వాళ్లు కనీసం రెండు రోజులు కూడా ఉండలేకపోయారు..!