రేపు దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రధమ వర్దంతి. దీంతో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో పలు కార్యక్రమాలకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కోవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇప్పటికే కోడెల తనయుడు శివరాంకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
కోవిడ్ నేపద్యంలో ఏ కార్యక్రమాలు చేయడానికి వీలు లేదని నోటీస్ లో పోలీసులు పేర్కొన్నారు. దీంతో పోలీసుల తీరు పై కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు యధావిధిగా అన్ని కార్యక్రమాలు చేపడతామన్న కోడెల శివరాం వైసిపి సభలకు లేని అడ్డంకులు మాకే ఏందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది హైదరాబాదులోని తన నివాసంలో టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే రేపు పోలీసులు ఈ కార్యక్రమాలు చేయకుండా అడ్డుకునే అవకాశమే ఎక్కువ కనిపిస్తోంది.