టీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్

-

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా ఉండే తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేసిన ఆయన మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఖమ్మం జిల్లాలో కార్మిక వర్గాలు మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అందరు సరైన ధ్రువీకరణ పత్రాలతో స్థానిక డిపో మేనేజర్ లను సంప్రదించాలని నోటిఫికేషన్లో వెల్లడించింది. కాంట్రాక్ట్ ప్రతిపాదికన దినసరి వేతనంతో వెంటనే విధుల్లోకి తీసుకోనున్నారు.

డ్రైవర్లకు రోజుకు రూ. 1500, కండక్టర్లకు వెయ్యి రూపాయలు ఇవ్వనున్నారు. ఇక మెకానిక్, ఎలక్ట్రీషియన్, టైర్ మెకానిక్ లకు రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తారు. ఇక ఐ‌టి ట్రైనర్ నిపుణులకు రోజుకు 1500 చెల్లించుకున్నారు. కాగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు ఉదృతం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుండటంతో కేసీఆర్ ఏకంగా దసరా సెలవులు రెండోసారి పొడిగించారు. కార్మికులు ప్రభుత్వానికి ఎన్ని వార్నింగ్‌లు ఇస్తున్నా కేసీఆర్ ఎంత మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

తాజాగా ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యతో ఉద్యమం మరింత ఉధృతం అయ్యేలా కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కూడా ఆర్టీసీకి మద్దతుగా నిలవడంతో ప్రభుత్వానికి ఇబ్బందిగానే మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో ఆర్టీసీ కార్మికులను మరింత షాక్ త‌గిలిన‌ట్ల‌య్యింది. మరి దీనిపై కార్మికుల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version