బాల‌య్య 105 టైటిల్ రూల‌ర్ కాదా… కొత్త టైటిల్ ఇదే..?

-

యుర‌వ‌త్న నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటిస్తోన్న 105వ సినిమా శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సీ క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ‌తంలో ఇదే సీ క‌ళ్యాణ్‌, కేఎస్‌.ర‌వికుమార్, బాల‌య్య కాంబోలో వ‌చ్చిన జై సింహా సినిమా 2018 సంక్రాంతికి వ‌చ్చి మ‌రీ హిట్ అయ్యింది. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ అవ్వ‌డంతో పాటు నిర్మాత క‌ళ్యాణ్‌కు సైతం లాభాలు తెచ్చిపెట్టింది.

ఇక తాజాగా తెర‌కెక్కే సినిమా సైతం అదే ఫార్మాట్‌లో తెర‌కెక్క‌నుంద‌ట‌. ఈ సినిమాకి మొదట్లో ‘రూలర్’ అనే టైటిల్ నిర్ణయించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ అదే కన్ఫర్మ్ అనుకున్నారు. అయితే ఇప్పుడు టైటిల్ విష‌యంలో స‌రికొత్త ట్విస్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాకు ఇప్పుడు కొత్త‌గా ‘జడ్జిమెంట్’ అన్న టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

ఇక జ‌డ్జిమెంట్ అన్న టైటిల్ పైకి చూసేందుకు చాలా సాఫ్ట్‌గా ఉన్నా బాల‌య్య రేంజ్‌లో రౌద్రం, యాక్ష‌న్‌కు తిరుగు ఉండ‌ద‌ని…. ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వికుమార్ ఫంక్తు క‌మ‌ర్షియ‌ల్గా ఈ సినిమాను మ‌లిచిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం బాల‌య్య ఏకంగా రు.10 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ పై సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version