ఫెదరర్‌, నాదల్‌కు రెండడుగుల దూరంలో సెర్బియా స్టార్‌ జకోవిచ్‌

Join Our Community
follow manalokam on social media

ఆస్ట్రేలియా ఓపెన్‌ గెలుపుతో…రికార్డులు సృష్టించాడు జకోవిచ్‌. ఒకే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీని తొమ్మిదిసార్లు గెలుచుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. 13 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లతో రఫేల్‌ నాదల్‌ టాప్‌ప్లేస్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరోసారి సత్తా చాటిన సెర్బియా స్టార్ జకోవిచ్‌ ఫైనల్‌లో మద్వెదెవ్‌ను చిత్తు చేసి..టైటిల్‌ కొట్టేశాడు. ఆస్ట్రేలియా టోర్ని కింగ్ తానేని మరోసారి నిరూపించాడు.

సెర్బియా స్టార్‌ జకోవిచ్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ అంత ఈజీగా దక్కలేదు. టోర్నీలో గాయం వేధించింది. ఒకానొక సమయంలో… ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకుంటారని అందరూ భావించారు. వెన్నునొప్పి వేధించినా…ఆటను కంటిన్యూ చేశాడు. టోర్నీలో గాయం వేధించినా చివరికి విజయం సాధించాడు

టేలర్‌ ఫ్రిట్జ్‌తో జరిగిన మూడో రౌండ్‌లో జొకో వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐనా నొప్పిని భరించాడు. ఎట్టకేలకు ఐదు సెట్లలో గెలిచి ఓటమి నుంచి తప్పించుకున్నాడు. వెన్నునొప్పిపై జకోవిచ్ ప్రకటించే వరకూ ఎవరికీ తెలియలేదు. వెన్నునొప్పితో టోర్నీ నుంచి మధ్యలో నుంచే వెళ్లిపోతానని భయపడినట్లు చెప్పాడు. ఆ తర్వాత ప్రిక్వార్టర్స్‌లోనూ కష్టపడే గెలిచాడు. అయితే క్వార్టర్స్‌ నుంచి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకొని విజయాల బాట పట్టాడు.

జొకోవిచ్‌కు ఇది 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. ఇప్పటి వరకు అతడు 9సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఐదుసార్లు వింబుల్డన్‌, మూడుసార్లు యూఎస్‌ ఓపెన్‌, ఓసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ గెలుచుకున్నాడు. నాదల్‌, ఫెదరర్‌ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాడు జకోవిచ్‌. మొత్తంగా ఇది తొమ్మిదో ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌. చివరి 10 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో జకోవిచ్‌ ఆరు టైటిళ్లు కైవసం చేసుకోవడం విశేషం.

ఈ విజయంతో ఈ ఏడాది మార్చి 8 వరకు జకోవిచ్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా ఉంటారు. దీంతో టాప్‌ ర్యాంకులో 311 వారాలు పూర్తి పూర్తి చేసుకొని.. ఫెదరర్‌ పేరిట ఉన్న 310 వారాల ఆల్‌టైమ్‌ రికార్డును బ్రేక్ చేయనున్నాడు.

TOP STORIES

ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని...