రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడానికి ఇదే సరైన సమయం: కంగనా రనౌత్

-

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కంగనా రనౌత్‌ రాజకీయాల్లోకి రానున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఎంట్రీపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించారు. ఒకవేళ తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయమని అన్నారు. ‘దేశం కోసం నేను ఎంతో చేశా. సమస్యలపై సినిమా సెట్ నుంచే పోరాడి జాతీయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నా అని అన్నారు. సినిమాల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది అని తెలిపారు. ప్రజలు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. దేశం నాకు చాలా ఇచ్చింది. తిరిగి ఇవ్వడం నా బాధ్యత’ అని చెప్పారు.

కంగనా వివిధ సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే కంగన రనౌత్‌ బీజేపీలో చేరితే స్వాగతిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలోనే పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆమె కీలక పాత్రలో నటించిన ‘ఎమర్జెన్సీ’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తున్నారు. దీనితో పాటు ‘తను వెడ్స్‌ మను పార్ట్‌ 3’ లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news