ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ కరోనా నేపథ్యంలో కస్టమర్లు తమ ఇంటి వద్దే శాంసంగ్‌కు చెందిన పలు ఉత్పత్తులను కొనుగోలు చేసే వీలు కల్పిస్తోంది. అందులో భాగంగానే ఆ కంపెనీ తాజాగా ఎక్స్‌పీరియెన్స్ శాంసంగ్ ఎట్ హోం పేరిట ఓ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కస్టమర్లు తమ ఇంటి వద్దే శాంసంగ్‌కు చెందిన స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, వియరబుల్ డివైసెస్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే డిజిటల్ మాధ్యమంలో చెల్లింపులు చేయవచ్చు. పూర్తిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా శాంసంగ్ ఉత్పత్తులను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ ప్రొడక్ట్స్‌ను ఎలా కొనవచ్చంటే…
* https://www.samsung.com/in/samsung-experience-store/home-delivery-demo/ అనే పోర్టల్‌లో కస్టమర్లు ముందుగా తమ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను ఎంటర్ చేసి శాంసంగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలపాలి.
* కస్టమర్లు తమకు సమీపంలోని శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను ఎంచుకోవాలి.
* స్టోర్ నుంచి 24 గంటల్లోగా కస్టమర్లకు అపాయింట్‌మెంట్ కాల్ వస్తుంది. కస్టమర్లు చెప్పిన సమయానికి స్టోర్ ప్రతినిధులు వస్తారు.
* కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ స్టోర్ ప్రతినిధులు కస్టమర్ కావాలనుకున్న డివైస్‌కు డెమో చూపిస్తారు.
* కస్టమర్ కావలిస్తే ఆ డివైస్‌ను కొనవచ్చు. పేమెంట్ కూడా డిజిటల్ రూపంలో చెల్లించాలి.
* ప్రక్రియ పూర్తి కాగానే శాంసంగ్ నుంచి ఫీడ్‌బ్యాక్ కోసం ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో ఉండే లింక్‌ను సందర్శించి ఈ కార్యక్రమం పూర్తి అనుభవం ఎలా ఉందో ఫీడ్‌బ్యాక్ చెప్పవచ్చు.
ఇలా కస్టమర్లు శాంసంగ్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900 ఎక్స్‌క్లూజివ్ రిటెయిల్ ఔట్‌లెట్ల ద్వారా శాంసంగ్ కంపెనీ ఈ సేవలను అందిస్తోంది. త్వరలో మరిన్ని స్టోర్లను ఇందులో యాడ్ చేయనుంది.