ఇక‌పై మీరు క‌దిలే రైలు లోనూ బ‌ర్త్ డేల‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

-

బ‌ర్త్ డేల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఇళ్ల‌లో లేదా రెస్టారెంట్ల‌లో లేదా ఇత‌ర ఏవైనా ప్ర‌త్యేక ప్ర‌దేశాల్లో సెల‌బ్రేట్ చేసుకుంటుంటారు. అయితే ఇక‌పై క‌దిలే రైళ్ల‌లోనూ మీరు బ‌ర్త్ డేల‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌చ్చు. అవును.. నిజ‌మే. ఈ అవ‌కాశాన్ని ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. క‌దిలే ట్రెయిన్‌లో బ‌ర్త్ డేల‌ను సెల‌బ్రేట్ చేసుకునే కొత్త స‌దుపాయాన్ని ఐఆర్‌సీటీసీ తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది.

now you can celebrate birth days in moving train

భార‌తీయ రైల్వేలో న‌డుస్తున్న‌ తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎవ‌రైనా స‌రే బ‌ర్త్ డేల‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌చ్చు. దీంతో ల‌క్కీ డ్రా కూడా నిర్వ‌హిస్తారు. అందులో విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అందజేస్తారు. తేజ‌స్ ఎక్స్‌ప్రెస్‌లో అందిస్తున్న ఈ ఆఫ‌ర్‌పై ఐఆర్‌సీటీసీ ట్వీట్ ద్వారా వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

ఆగ‌స్టు 27 నుంచి సెప్టెంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంద‌ని ఐఆర్‌సీటీసీ వెల్ల‌డించింది. ల‌క్కీ డ్రాలో గెలుపొందిన వారికి బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తారు. కాగా దేశంలోనే మొద‌టి ప్ర‌యివేటు రైలుగా తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరుగాంచింది. ఐఆర్‌సీటీసీ ఆధ్వ‌ర్యంలో భార‌తీయ రైల్వేలో దీన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు ప్యాసింజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు అనేక ఆఫ‌ర్ల‌ను తేజ‌స్ రైలులో అందిస్తున్నారు.

కాగా బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకునేవారు ముందుగా తేదీ, స‌మ‌యంతో బుక్ చేసుకోవాలి. ఒక రోజుకు 13 మందికి మాత్ర‌మే ఇందుకు అనుమ‌తిస్తారు. ఏరోజు కారోజు 13 మంది పేర్ల‌తో డ్రా తీస్తారు. విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను ఇస్తారు. ఐఆర్‌సీటీసీ సైట్‌లో బ‌ర్త్ డే సెల‌బ్రేషన్స్‌కు బుక్ చేసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news