Breaking : రేపటి నుంచి ప్రత్యక్ష తరగతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

-

రేపటి నుంచి ప్రత్యక్ష తరగతులకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన పై… ప్రభుత్వం ఇలాంటి బలవంతం చేయవద్దు అని హెచ్చరించింది హైకోర్టు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యాసంస్థల మేనేజ్మెంట్ ల పై ఒత్తిడి తెచ్చే వద్దని హెచ్చరించింది.

విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇలాంటి రాతపూర్వక హామీ తీసుకోవద్దని పేర్కొన్న తెలంగాణ హైకోర్టు… తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రెసిడెన్షియల్ హాస్టళ్లను తిరగకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలు నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేసింది హైకోర్టు. అలాగే ప్రత్యక్ష బోధన పై వారంలోగా పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని… తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోందని పేర్కొన్న హై కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. కాగా రేపటి నుంచి విద్యా సంస్థలు రీ ఓపెన్ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news