జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. నెల‌కు రూ.141 EMIతో జియో ఫోన్ 2 కొన‌వ‌చ్చు..!

-

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. జియో ఫోన్ 2 ను క‌స్ట‌మ‌ర్లు నెల‌కు రూ.141 ఈఎంఐతో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందుకు గాను ముందుగా రూ.99 చెల్లించాలి. అయితే ఈ ఆఫ‌ర్ కేవ‌లం క్రెడిట్ కార్డులు క‌లిగిన వారికే వ‌ర్తిస్తుంది. క్రెడిట్ కార్డుతో నెల‌కు రూ.141 ఈఎంఐతో జియో ఫోన్ 2 ఫీచ‌ర్ ఫోన్‌ను కొన‌వ‌చ్చు. శ్రీ‌కృష్ణ జ‌న్మాష్ట‌మి సంద‌ర్బంగా ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు జియో తెలిపింది.

now you can get jio phone 2 for emi of rs 141 only

జియో ఫోన్ 2 ఫీచ‌ర్ ఫోన్ ధ‌ర ప్ర‌స్తుతం మార్కెట్‌లో రూ.2,999గా ఉంది. దీన్ని నెల‌కు రూ.141 ఈఎంఐతో ప్ర‌స్తుతం క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే సౌక‌ర్యం అందిస్తున్నారు. వినియోగ‌దారులు ఫోన్‌ను ఆర్డ‌ర్ చేస్తే 3 నుంచి 5 రోజుల లోగా డెలివ‌రీ పొంద‌వ‌చ్చు. అయితే ఆ ఫోన్‌తో వ‌చ్చే జియో సిమ్ కార్డును యాక్టివేట్ చేసుకోవాలంటే స‌మీపంలోని జియో స్టోర్ లేదా రిల‌య‌న్స్ డిజిట‌ల్ స్టోర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

ఇక రూ.99కి గాను వినియోగ‌దారుల‌కు 14 జీబీ డేటా వ‌స్తుంది. ఉచిత కాల్స్‌, 300 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది. త‌రువాత య‌థావిధిగా రీచార్జి చేసుకోవాలి. అలాగే జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను కూడా అందిస్తారు.

జియో ఫోన్ 2 ఫీచ‌ర్ ఫోన్‌లో 2.4 ఇంచ్ డిస్‌ప్లే, కై ఓఎస్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌, గూగుల్ మ్యాప్స్ యాప్స్‌, క్వ‌ర్టీ కీప్యాడ్‌, 2000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 24 భార‌తీయ భాష‌ల‌కు స‌పోర్ట్‌, డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ బ‌ట‌న్‌, 512ఎంబీ ర్యామ్‌, 4జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ వీవోఎల్‌టీఈ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news