తగ్గడంలేదుగా: ఆర్.ఆర్.ఆర్. నోట “బొచ్చు” మాట!

-

జగన్ గారంటే చాలా ఇష్టం.. మరో ముప్పై ఏళ్లు ఆయనే సీఎంగా ఉండాలని నోటితో చెబుతూనే… నొసటితో అత్యంత బలంగా వెక్కిరించే పనిని అత్యంత చాకచక్యంగా చేసుకుపోతున్నారనే కామెంట్లను ఎదుర్కొంటున్న రఘురామకృష్ణంరాజు మరోసారి మైకందుకున్నారు.. తనపై చేస్తోన్న వ్యక్తిగత విమర్శలకు.. ఘాటుగా స్పందించారు!

అవును… గతంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని, ఇప్పుడు డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించిందని.. ఆయన తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అంటూ… గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈమధ్య ఆర్.ఆర్.ఆర్.పై సోషల్ మీడియా వేదికగా… “గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్టు.. స్వపక్షంలో విపక్షమంటూ కొత్త పత్యానికి పరుగులు పెట్టి.. మాటతో సరిపెట్టుకునేదానికి వేటుదాకా తెచ్చుకున్న… రాజుగారి విగ్గు ఊడినట్లేనా? విగ్గు ఊడిపోతే రేపటినుంచి ఎలా తిరుగుతారో?” అంటూ కామెంట్ చేశారు!

ఆ కామెంట్ పై తీవ్రస్థాయిలో ఫైరయిన ఆర్.ఆర్.ఆర్… “పిచ్చివాడా… నువ్వు సరిగ్గా నిలుచుంటే నా బొడ్డు వరకు రావు.. మరి నీకు నా జుట్టు ఎలా కనబడిందో తెలియదు.. అందరూ నీలాగా పొట్టిగా, నల్లగా, వికారంగా ఉండాలని కోరుకోవడమే నీ సంస్కారం అయితే నేనేమిచేయలేను.. నా జుట్టును కవర్ చేసుకుంటే నీకెందుకు, నా బొచ్చుకు నీకు ఏంటి సంబంధం” అని ముగించారు! దీంతో… తనపై వచ్చే విమర్శలకు, వ్యక్తిగత విమర్శలకు తాను ఏ రేంజ్లో స్పందిస్తారో చెప్పినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఆర్.ఆర్.ఆర్. రిప్లై హల్ చల్ చేస్తోంది!!

Read more RELATED
Recommended to you

Latest news