ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని అమలు చేస్తామని చెప్పడంతో చిర్రెత్తుకొచ్చిన యూజర్లు పెద్ద ఎత్తున వాట్సాప్‌ను తీసేసి టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్స్‌కు మారారు. అయితే టెలిగ్రామ్ యాప్ తాజాగా వాట్సాప్ యూజర్ల కోసం ఓ ప్రత్యేకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదేమిటంటే..
వాట్సాప్ యాప్‌లో ఉన్న చాట్లను యూజర్లు సులభంగా టెలిగ్రామ్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. అందుకు గాను కింది స్టెప్స్‌ను పాటించాల్సి ఉంటుంది.
ఐఓఎస్ యూజర్లు అయితే..
* కాంటాక్ట్ ఇన్ఫో లేదా గ్రూప్ ఇన్ఫోను ఓపెన్ చేసి అందులో ఉండే ఎక్స్పోర్ట్ చాట్‌ను క్లిక్ చేయాలి. అనంతరం వచ్చే ఆప్షన్ల నుంచి టెలిగ్రామ్‌ను ఎంచుకోవాలి. దీంతో యూజర్ ఎంచుకున్న కాంటాక్ట్ లేదా గ్రూప్ చాట్ టెలిగ్రామ్‌లోకి సులభంగా ట్రాన్స్ఫర్ అవుతుంది.
ఆండ్రాయిడ్ యూజర్లు అయితే…
* వాట్సాప్ చాట్‌లో పై భాగంలో కుడివైపున ఉండే మూడు నిలువు చుక్కలపై ప్రెస్ చేయాలి. అక్కడ వచ్చే మోర్ విభాగంలో ఉండే ఎక్స్పోర్ట్ చాట్‌ను ఎంచుకోవాలి. అందులో టెలిగ్రామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయాలి. దీంతో యూజర్లకు చెందిన ఆండ్రాయిడ్ వాట్సాప్ యాప్ చాట్ లు టెలిగ్రామ్‌లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి.