నీట్,నెట్ పరీక్షల నిర్వహణపై దేశ వ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నీట్, నెట్ పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ఛీఫ్ సుబోధ్ కుమార్‌ను NTA డీజీ బాధ్యతల నుంచి తప్పించి కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
ఎన్‌టీఏ ద్వారా నిర్వహించే పరీక్షలు పారదర్శకంగా సజావుగా సాగాలంటే తీసుకోవాల్సిన చర్యలపై ఇన్ పుట్స్ ఇచ్చేందుకు మాజీ ఇస్రో చీఫ్ కే రాధాకృష్ణన్ అధ్యక్షతన ఏడుగురు సభ్యుల కమిటీని శనివారం సాయంత్రం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నియమించింది. అనంతరం మరోప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ఛీఫ్ సుబోధ్ కుమార్‌ను తప్పిస్తూ ఆయన స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారిని విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రదీప్ కరోలాను నియమించింది.1985 బ్యాచ్ కర్నాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన కరోలా 2017లో ఎయిరిండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఎన్ టీ ఏ చీఫ్ గా ఆయన నియామకాన్ని కేంద్ర కేబినెట్ లోని నియామకాల కమిటీ ఆమోదించిందని కేంద్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.