‘రుద్ర’గా వస్తున్న ఎన్టీఆర్

-

జూ.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా కోసం అభిమానులతో పాటు… తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో మోషన్ పోస్టర్ విడుదలై ఏడాది కావస్తుంది.

ఆర్ఆర్ఆర్ తో సూపర్ సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్… ప్రస్తుతం ఎన్టీఆర్ 30కి సిద్ధమవుతున్నారు. అటు ప్రేక్షకులతో పాటు ఇటు టాలీవుడ్ పెద్దలు కూడా ఎన్టీఆర్30పై భారీ అంచనాలే పెట్టుకున్నారు. కొరటాల శివ తెరకెక్కించిన చిరు మూవీ ఆచార్య ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో మనకి తెలుసు.
అది దృష్టిలో పెట్టుకునే కొరటాల స్క్రిప్ట్ పై మరింత శ్రద్ధ పెడుతున్నారని సినీ పండితులు అంటున్నారు. అసలే వరుస హిట్ లతో మంచి ఊపు మీద ఉన్న ఎన్టీఆర్ కి మరో సూపర్ హిట్ ఇచ్చే కథని సిద్ధం చేసేందుకే కొరటాల ఇంత సమయం తీసుకుంటున్నారని టాలీవుడ్ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్ 30 అప్డేట్ ఇవ్వాలంటూ ట్విట్టర్ లో ఎన్టీఆర్ 30 అనే పేరు మీదు హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి అది ట్రెండ్ అయ్యేలా చేశారు.అయితే ఇప్పుడు వచ్చినా తాజా అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. ఊర మాస్ సినిమాగా రాబోతున్న ఎన్టీఆర్ 30కి చిత్రబృందం ‘రుద్ర’గా టైటిల్ ఖరారు చేసినట్లు నెట్టింట వైరల్ అవుతుంది. క్లాస్ డైరెక్టర్ కొరటాల రుద్రతో మాస్ డైరెక్టర్ అవుతాడా?… ఇంతకీ ఎన్టీఆర్ 30కి రుద్రనే అసలైన టైటిలా?… వరుస హిట్ లతో ఊపుమీదనున్న తారక్ కి కొరటాల మరో సూపర్ హిట్ ఇవ్వబోతున్నారా..? ఇవ్వని తెలియాలంటే మనం 2024 ఏప్రిల్ 5 వరకూ ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news