ఎన్టీఆర్‌ చేతికి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్‌ !

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, యంగ్‌ టైగన్‌ ఎన్టీఆర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్‌ చేసే డాన్స్‌లు, డైలాగులు ఇలా ఎన్నో… రకాల షేడ్స్‌ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుత హీరోల్లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కు ఉన్న పాలోయింగ్‌ మరే హీరో కు లేకపోవడం గమనార్హం. అయితే.. తాజాగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. ఎన్టీఆర్‌ చేతికి సర్జరీ అయినట్లు సమాచారం అందుతోంది.

ఇంట్లో వ్యాయామం చేస్తున్నప్పుడు ఎన్టీఆర్‌ కుడి చేతి వేలికి గాయమైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌ కు చిన్నపాటి సర్జరీ కూడా అయినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం వైద్య సిబ్బంది సూచనలు తీసుకుంటున్నారని సమాచారం. అయితే… ఈ విషయం.. నిన్నటి నుంచి సోషల్‌ మీడియా వైరల్‌ అవుతోంది. కాగా.. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ మూవీ లో ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కోమురం భీం పాత్రలో నటిస్తున్నాడు ఎన్టీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news