Sunny Leone: సన్నీ లియోన్ .. ఫోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్ గా మరింది. తన హాట్ అందాలతో స్కీలర్ స్క్రీన్ ను హిటెక్కిస్తుంది. తన నటనతో అందర్నీ మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు. అప్పడప్పుడూ తన హాట్ హాట్ ఇమేజెస్ కూడా పెడుతూ కుర్రకారుని రెచ్చగొడుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ, అప్పుడప్పుడు వేరే భాషల్లో కూడా స్పెషల్ సాంగ్స్, స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తుంది.
అయితే.. ఈ హాట్ బ్యూటీ ఇప్పుడూ ఓ సరికొత్త బిజినెస్ ప్రారంభించనున్నదట. ఇప్పటి వరకు ఈ బిజినెస్ ను ఏ ఇండియన్ యాక్టరెస్ చేయలేదంట. ఎంటో ఆ సరికొత్త బిజినెస్.. తెలుసుకుందాం..అదే ఎన్ ఎఫ్ టీ.. అసలు ఎన్‌ఎఫ్‌టీ అంటే ఏమిటి? డిజిటల్ బిజినెస్. ఇందులో సెలబ్రిటీలు తమ కు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, సినిమాలు, ప్రత్యేక ఫొటోలు, వీడియోలను ఈ ప్లాట్ ఫాం పై వేలం వేస్తారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా జరుగుతుంది.
ఈ డిజిటల్ ఆస్తులను వేలం ద్వారా ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌టీలను కొన్నవారు తిరిగి వాటిని మళ్లీ వేలం వేసుకోవచ్చు. అయితే ఇలా వేలం జరిగినప్పుడల్లా వేలం మొత్తంలో 10 శాతం ఎన్‌ఎఫ్‌టీ క్రియేటర్లకు వాటాగా వెళుతుంది. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఈ ఎన్‌ఎఫ్‌టీ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఈ జాబితాలోకి ప్రవేశించి ఈ ఘనత అందుకున్న భారత తొలి నటిగా గుర్తింపు అందుకుంది. “మిస్ ఫిట్జ్” పేరుతో ఈ ఎన్‌ఎఫ్‌టీ తీసుకొని వచ్చింది. ఇందులో 9,600 ఎన్‌ఎఫ్‌టీ.లు ఉన్నాయి.
ఇప్పటికే.. ఈ బిజినెస్ కు సంబంధించి వివరాలను సన్నీ లియోన్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ‘మిస్ ఫిజ్‌ను కలవండి! ఇది మిస్ ఫిజ్ హనీ! ఆమెకు గులాబీ రంగు అంటే ఎంతో ఇష్టం. ట్యాటూలు వేయించుకున్నా అబ్బాయిలన్నా ఇష్టమే. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా దేనికోసం ఎదురుచూస్తున్నారు. సన్నీ లియోన్ ఎన్‌ఎఫ్‌టీలు సిద్ధంగా ఉన్నాయి ‘ అని సన్నీ పేర్కొంది.
ఇప్పటికే ఈ బిజినెస్‌లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖ నటులు ఎన్ఎఫ్‌టీ వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అమితా బచ్చన్ ఎన్‌ఎఫ్‌టీ వేలం మొదటి రోజున $5,20,000 (సుమారు రూ.3.8 కోట్లు) విలువైన అమ్మకాలు జరిపిన విషయం తెలిసిందే.