సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి కనుమరుగైన వారు చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉండి ఇండస్ట్రీ ని షేర్ చేసిన వారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. కొందరు సీనియర్ నటీమణులు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమ సత్తా చాటుతున్నారు. మరికొంతమంది వివాహం చేసుకుని ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నారు. గతంలో టాలీవుడ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగినా గజాల ప్రతి ఒక్కరికి గుర్తు ఉండనే ఉంటుంది. అప్పటి అగ్రహీరోల సరసన అందరితో నటించింది.
ఇక ఆ తర్వాత మలయాళం ఇండస్ట్రీలో కూడా నటించింది. 2001వ సంవత్సరంలో నాలో ఉన్న ప్రేమ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఆ తరువాత కలుసుకోవాలని, స్టూడెంట్ నెంబర్ వన్ వంటి చిత్రాలతో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక ఆ తర్వాత అల్లరి రాముడు, ఓ చిన్నదాన, మనీ మనీ మోర్ మనీ, అదృష్టం, తదితర చిత్రాలలో నటించి మంచి ప్రేక్షకుల ను సంపాదించుకుంది. దాదాపుగా 30 సినిమాలకు పైగా నటించింది. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో స్టార్ హీరోయిన్ గా వెలిగింది.