పాకిస్తాన్ అణు పితామహునిగా పిలువబడుతున్న అబ్దుల్ ఖాదీర్ ఖాన్( A.Q ఖాన్ ) మరణించారు. 85 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో మరణించారు. పాకిస్తాన్ ను అణు దేశంగా మార్చడంలో A.Q ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు. 1936 భోపాల్ లో జన్మించిన ఆయన దేశ విభజన సందర్భంగా 1947లో పాకిస్తాన్ కు కుటుంబంతో సహా వలస వెళ్లారు. 90 వ దశకంలో పాక్ లో నిర్వహించిన అణు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు.
పాక్ అణు పితామహుడు A.Q ఖాన్ మరణం
-